Sunday

మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే

కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లంజిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం.
                                     ***
ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ వయస్సులో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళను మోకాళ్ళవరకూ దేశానికి ఇచ్చేసి... ఓ సైనికుడిగా గర్వంగా తిరిగిన ఊర్లో, సానుభూతిగా బతకడం ఇష్టంలేక... తల్లిని, భార్యను, పదేళ్ల కొడుకు మహావీర్ సింగ్ ని తీసుకుని మా కాకినాడకు వచ్చేశారు.

కాకినాడకు వచ్చిన మూడేళ్లకు చిన్న కొడుకు ఓంవీర్ సింగ్ పుట్టాడు.
                                   ***
మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే అని నిరూపిస్తూ తన భార్య, తల్లితో కలిసి మిఠాయి దుకాణం మొదలుపెట్టారు.

బంగారు రంగులో, బెల్లం పాకంతో... వేడి వేడిగా... కరకరలాడుతూ అమృతానికి సరిజోడులా ఉండే ఆ జిలేబి రుచి గుర్తుకు వస్తే చాలు మా కాకినాడ జనాలు ఆ దుకాణం దగ్గర జేరిపోయేవారు.
                                   ***
ప్రతీ ఆగష్టు పదిహేనుకి, జనవరి ఇరవై ఆరుకి తన దుకాణం  దగ్గర జండా ఎగురవేసి అక్కడికి వచ్చే జనాలకు ఉచితంగా జిలేబి పంచేవారు.

సినిమా రోడ్డులో ఉండే కోకనాడ అన్నదాన సమాజంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రతీ ఆదివారం తన వంతుగా పదికిలోల జిలేజీ ఇచ్చేవారు.

ఆయన గొప్పదనం.... చేతి రుచి రెండూ తెలిసిన మా కాకినాడ జనాలు ఆయన్ని ముద్దుగా జిలేబి సింగోరు అని పిలిచే వాళ్ళు.
                                     ***
అప్పుడెప్పుడో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కట్టించిన స్కూల్లో చేరి, బాగా చదివే పెద్ద కొడుకు మహావీర్ సింగుని ఎలాగైనా పూణే దగ్గర ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడిమీలో చేర్చి, మహా వీరుడులా చూడాలి అనుకునే వారు.

మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. బాగా చదివే మహావీర్ తాను డాక్టర్ కావాలని కోరుకున్నాడు.

తన ఇష్టాన్ని తనలోనే ఉంచేసుకుని మహావీర్ ని అతను చదవాలి అనుకునే మెడిసిన్ లోనే చేర్చారు ధరమ్ వీర్ గారు. 
                                   ***
అలుపన్నది తెలియని సూర్యుడు ఉదయిస్తూ... అస్తమిస్తూనే ఉన్నాడు. అతనితో కలిసి కాలం పరిగెడుతూనే ఉంది.
                                   ***
చదువులో అన్నకు తగ్గ తమ్ముడిగా ఉండేవాడు ఓంవీర్.  చిన్నప్పటి నుండి లెక్కల్లో ఎంతో ముందు ఉండేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కొట్లో ఉండి... అక్కడికి వచ్చే మనుషుల మనసులను చడవడం అలవాటు చేసుకోసాగాడు.
                                    ***
ఓరోజు ధరమ్ వీర్ గారి తల్లికి బాగా సుస్తి చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు ఏదో స్ట్రైక్ లో ఉండటంతో సమయానికి సరైన వైద్యం దొరకక ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.

జరిగిన సంఘటన ఆ తండ్రీ కొడుకుల మీద చాలా ప్రభావాన్నే చూపించింది.
                                   ***
మెడిసిన్ ఐన తర్వాత ఆ మిఠాయి దుకాణం దగ్గరే కేవలం ఐదు రూపాయల ఫీజుతో ఆసుపత్రిని మొదలుపెట్టారు మహావీర్ సింగ్. హస్తవాసి అంటారు చూడండి... అది నిజం అన్నట్లు ఎంతటి రోగమైనా సరే ఆయన చెయ్యి పడగానే తగ్గిపోయేది. అసలు ఆయన మన చేయి పట్టుకుంటే చాలు... మన రోగం సగం తగ్గిపోతుంది అనే నమ్మకం కలిగింది మా అందరికీ. నెమ్మదిగా ఆయన్ను మా కాకినాడ జనాలు ఐదు రూపాయల డాక్టరుగోరు అనడం మొదలుపెట్టారు.

తనకు మందుల కంపెనీలు శాంపిల్స్ గా ఇచ్చే మందులనే రోగులకు ఇచ్చేవారు. ఓ పాతిక రూపాయలు ఉంటేచాలు... ఆపరేషన్ కాని, ఎంత పెద్ద రోగానికైనా ఆయనతో వైద్యం చేయించుకోవచ్చు అనుకునేవాళ్ళు మావాళ్ళు.
                                   ***
దుకాణం పెట్టిన కొత్తలో రోజుకి పాతిక ముప్పై కిలోలు అమ్మే వ్యాపారం... ప్రస్తుతం రోజుకి మూడు వందల కిలోలకు పైగానే పెరిగింది.

దుకాణం నుంచి వచ్చే లాభాలలో చాలామటుకు ఆసుపత్రి నిర్వహణకే ఖర్చు పెట్టేవారు ఆ కుటుంబం.
                                    ***
ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్న వేళ మహావీర్ గారు తమ్ముడు ఓంవీర్ కూడా తనలాగే డాక్టర్ చదివితే ప్రజలకు ఇంకా సేవ చెయ్యొచ్చు అన్నారు. అది విన్న ధరమ్ వీర్ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి చిన్న కొడుకు వైపు చూశారు.

తనకు తినడానికి రొట్టెలు పెడుతున్న అమ్మకు, నమస్కరించి తండ్రి వైపు తిరిగి నేను డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని ఓంవీర్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

అన్నయ్యా మీరు చేస్తున్న సేవ నిరాకాటంగా సాగాలి అంటే మన మిఠాయి దుకాణం కూడా కొనసాగుతూనే ఉండాలి. నేనూ చదువుకోసం దుకాణం వదిలేస్తే... నాన్నగారి తర్వాత మనం ఆ దుకాణాన్ని వదిలేసుకోవాలి. అలా చేస్తే ఇప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు చేస్తున్న పనులు ఏమీ చేయలేము. మన ఆసుపత్రి ద్వారా మీరు చేసే సేవ ఎల్లకాలం జరగాలి అంటే... మన మిఠాయి దుకాణం కూడా ఎల్లకాలం నడవాలి. అందుకని నేను మిఠాయి దుకాణం బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు.

చిన్నవాడైనా ఎంతో ముందు చూపుతో అతను చెప్పిన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
                                     ***
ఆ సంవత్సరం సంక్రాంతికి మా కాకినాడ ముస్తాబు అవుతోంది.

కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉండే ఆ మిఠాయి దుకాణం, పక్కనే ఉన్న ఆసుపత్రి కొత్త రంగులు దిద్దుకుంటుంన్నాయి.

ఏ జన్మలోని ఋణానుబంధమో... ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడి జనాల కోసం తపనపడే... జిలేబి సింగోరు, ఐదు రూపాయల డాక్టరు గార్ల ఋణం  కాకినాడ జనాలు ఎప్పటికీ తీర్చుకోలేరు.

Friday

అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది

#ఉచిత_సలహా

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక
నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ
వెళుతున్నారు.

అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక
పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా,
ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు.

వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది?
ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు.

అందుకాయన...

"అదిగో అక్కడ కనిపిస్తున్న
పొదలో మనుషుల్ని చంపేది ఉంది" అన్నాడు....

వాళ్ళిద్దరూ
భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని
అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను
కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది
బయటపడింది." అన్నాడాయన.

"ఇంతకీ ఏమిటది?"
అని అడిగారు వాళ్ళిద్దరూ....

కంగారుగా. "బంగారు
నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి.

వాళ్ళిద్దరూ
సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన
దారిన పోయాడా సన్యాసి...

అప్పుడు వాళ్ళిద్దరూ ఆ పొదవైపు
పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ
బంగారు నాణేలు కనిపించాయి.

"ఈ సన్యాసి ఎంత
మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని
మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక
మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం
చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని
మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం
ఉంది అన్నాడు. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం.
మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం."
అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా
ఉన్నాడు.
రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు.

ఈలోగా
మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు
నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత
బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి
సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా
మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది.
దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే
బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి
చంపేస్తాను.
ఎవరికీ అనుమానం రాదు. బంగారం
అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని
నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన
ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి?
మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు
చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ
వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు.
ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి
ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి..

కాబట్టి నేను
తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని
వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా
బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు.

అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం
నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి
ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి
కత్తితో పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు
పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను."
అనుకుని
ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని
తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత
వాయువుల్లో కలిసిపోయాయి.

"సన్యాసి మాటలు
ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.
రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అని అడిగితే.... 
హరిశ్చంద్రుని చేత అబద్దం ఆడిస్తాను..
భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను..
తండ్రి బిడ్డల్ని విడదీస్తాను..
అన్నా దమ్ముల మధ్య వైరం పెడతాను..
ఆఖరికి ప్రాణ స్నేహితులను విడగొడతాను...  అందిఅట...ఆ
రూపాయి…. అని పెద్దల నానుడి.

కాబట్టి ఆ
రూపాయి విషయంలో జాగ్రత్త...

ఈ రూపాయి కంటే విలువైనవి మానవతా విలువలు...

మనిషిని మనిషిగా  చూసే ప్రతి విలువ, నిన్ను  గొప్పవాన్ని  చేస్తుంది.

దయ చేసి మీ *కుటుంబము *సమాజము మరియు *మిత్రులతో*ఎప్పుడు టచ్ లో ఉండండి...

బంధాలని బంధం లాగే చూడండి దానికి ఎటువంటి చెడుని ఆపాదించకండి..

ముఖ్యంగా ఈ రూపాయికి లొంగిపోకండి.

Monday

తినే వాడికి ఏం తెలుసు వండే వాడి బాధ,పండించే వాడి ఆవేదన..........!!!

ఒక్క పల్లెటూరు లో ఒక్క హోటల్ ఉంది...
అక్కడకి ఒక్క సినిమా వాళ్ళు ఒక్క 40మంది
వచ్చారు అందరు వచ్చి రాగానే ఆ హోటల్ లో
జనం అంత చుట్టూ చూస్తున్నారు సినిమా
వాళ్ళని.
సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయపోతూన్నారు... అందరు హోటల్ లో
కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్
గారు వచ్చారు...
అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్
గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని
చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా
చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాత
ఇటురా అని పిలిచాడు...

ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... తాత
చేసా బాబయ్య అని చెప్పాడు...

మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ
కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే
నీకు ఇష్టమా అని అడిగాడు...??

అదేం లేదు బాబయ్య అని కొంచెం దీనంగా
మొహం పెట్టి చెప్పాడు...

మరి ఏంటి ఏమైనా
డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే
చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...

అదేం లేదు బాబయ్య.. నేను ఒక్కటి అడగాలి
అనుకుంటున అడగనా బాబయ్య...??

సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...

మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా
ఎవరేనా విడుదల అవ్వక ముందే #పైరసీ చేస్తే
ఏం చేస్తారు బాబ్బయ్య...??

ఏముంది అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అడిగాడు...??

అప్పుడు ఆ తాత మరి
ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి
సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??

అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో
ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...
అపుడు తాత అడిగాడు మీరు ఇంత మంది ఇక్కడ
భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల
మంది సగం అన్నంలో
చేతులు కడిగేసారు.అందుకే నేను అలా
చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...

దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా..  అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...

అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా
కట్టిస్తారు... కానీ మేము పండించే పంట
దళారులు దోపిడీ చేస్తున్నా రాబందులు
మమల్ని పీక్కు తింటున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని
పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??

డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని
అడిగాడు...??

తాత చెప్పాడు కోట్లు ఉన్న కోటీస్వరుడు అయినా,
దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు,దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఎదో ఒక్కసారి అయినా మమల్ని గుర్తు చేసుకోకపోయినా
వాడి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటయీ అని చెప్పాడు...

అందుకే బాబు ఇందాక మీరు సగం అన్నం లో
చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి
చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...
ఈ దేశం లో ప్రతి రోజు  ఆత్మహత్య చేసుకుని చనిపోయే రైతు ఉన్నాడు కానీ నిర్మాత లేడు...
మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం
భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...

ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే
మద్యపానం ఆరోగ్యానికి హానికరం...
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని
సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట
అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి
అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని
బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు...

NOTE: ఇదంతా మీకు సోది లా అనిపించోచ్చు కానీ
రోజు అన్నం లేక ఎంత మంది చనిపోతున్నారో
ఇక్కడ ఎంత మంది కి తెలుసు...??? మనకి
భోజనం సమయానికి వస్తుంది కాబట్టి మనకి
తెలియట్లేదు.. అదే రాకపోతే ఆ బాధ ఏంటో
తెలుస్తుంది... తినే వాడికి ఏం తెలుసు వండే వాడి బాధ,పండించే వాడి
ఆవేదన..........!!!

Friday

ఎంతో ప్రతిభ ఎందుకు కాకుండా పోతోంది

బ్రహ్మ భోజనం చేసి వచ్చి మళ్లీ తన సృష్టి మొదలు పెట్టాడు .తన పనులు ముగించు కొచ్చిన సరస్వతి పక్కన కూర్చుంటూ అడిగింది
"ఈవేళ ఏవిటండీ సృష్టిస్తున్నారు .."
"అద్భుతమైన కొందరు ప్రతిభా వంతులని " "అని చెప్పి సీరియస్ గా పనిచేస్తున్నాడు ఆయన .
ఓ గొప్ప గాయకుడిని సృష్టించాడు భూమ్మీదకి వదిలాడు .ఆ తర్వాత ఒక మహత్తరమైన రచయత్రిని  , ఓ అపూర్వ మైన చిత్రకారుడిని ,ఓ ప్రతిభా వంతుడైన ఆటగాడిని ,సరస్వతి కోరికమీద ఓ గొప్ప సంగీత విద్వాన్సుడిని , సృష్టించి భూమ్మీదకి పంపించి "కొంతమంది  ప్రతిభా వంతులని సృష్టించి నందుకు చాలా ఆనందంగా ఉంది దేవీ .."భార్యతో అన్నాడు బ్రహ్మ .
కొంత కాలం గడిచింది .
తను సృష్టించిన ఆ కారణ జన్ములు ..కళాకారులూ ..ఎంత గొప్పస్థాయి లో ఉన్నారో చూడాలని బ్రహ్మ సతీ సమేతుడై భూమ్మీదకి వచ్చాడు .
గాయకుడు మధురమైన స్వరం తో ఎక్కడ పాడుతున్నాడా అని వెతికాడు . కనిపించలేదు .
లక్షలాది జనాన్ని రచనలతో  ఉత్తేజ పరచవలసిన  రచయత్రి కోసం వెతికాడు .కనిపించలేదు .
సంగీతకచేరీలలో విద్వంసుడి గురించి ,ఆట స్థలం లో ఆట గాడి గురించి ..వెతికి , కనిపించక , నిరాశతో సరస్వతి కేసి తిరిగి "ఏమయ్యారు వీళ్ళు ..ఒకొక్కరికి ఒక్కక్క కళలో గొప్ప ప్రతిభని ఇచ్చి పంపితే ..వీళ్లు ఏమయ్యారు .."అంటున్న ఆయన హఠాత్తుగా చూసి గుర్తుపట్టాడు వాళ్ళని ...
విద్వాన్సుడు ఓ బ్యాంకు మేనేజర్ గా  ఏవో లెక్కలు చూస్తున్నాడు విసుగ్గా .
రచయిత్రి పెద్ద కంపెనీ లో సేల్స్ సెక్షన్ లో  విరక్తిగా వర్క్ చేస్తోంది .
ఆటగాడు సాఫ్ట్వేర్ కం పేని లో కంప్యూటర్ ముందు చిరాకుగా  వర్క్ చేస్తున్నాడు .
ఎవరూ కూడా వాళ్ళ టాలెంట్ చూపించే అవకాశం లేని చోట బతికేస్తున్నారు .
"ఏవిటిఈదారుణంస్వామీ. .వీళ్ళు  ..వీళ్లు ..ఇలాగా .."సరస్వతి అంది .
బ్రహ్మ నిట్టూర్చాడు .
దేవుడు ఇచ్చిన టాలెంట్ ని , కళ ని,ప్రతిభని వదులుకుని ..వాటిమీద మనకున్న ఇష్టాన్ని చంపుకుని ....
పెద్దల కోరిక అనో ,
పరిస్థితుల కారణం అనో ,
భద్రత కోసమనో ,
భాద్యత కారణం గానో ..మనసుకు నచ్చని పని చేసే ప్రతి మనిషి 'బతికేస్తాడు '
తప్ప జీవించడు .
ఆ విషయమే చెప్పాడు బ్రహ్మ సరస్వతితో ..
"ఎంతో ప్రతిభ ఎందుకు కాకుండా పోతోంది దేవీ ..పుట్టించి పంపటం వరుకే మన భాద్యత .జీవించటం ఎలాగ అనేది ..తానే నిర్ణయించుకోవాలి మనిషి .అనేక కారణాల వలన అర్ధం లేని నిర్ణయాలు తీసుకుని తన లోని ప్రతిభని చంపుకుని అసంతృప్తి తో బ్రతుకులని ముగించేస్తున్నారు  ఈ మనుషులు ..పాపం "
చెప్పటం ముగించి బరువెక్కిన గుండెతో భాధగా వెళ్ళిపోయాడు భార్యతో కలిసి బ్రహ్మదేవుడు ..

ఏమి కాదు నేను ఉన్న అనే చిన్న మాట చెప్పి చూడు.

*🚶‍♂ఒకసారి ఒక పిరికివాడు ఒక స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి... కొంచెం దూరంలో ఒక వ్యక్తి వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు...*

*ఇంతకీ విషయం ఏమిటంటే...ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడు...కాని కేవలం వాడికి వీడు...వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది...🤝*

*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే...నేను ఉన్నాను అనే భరోసా...🗣ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్న అనే చిన్న మాట చెప్పి చూడు...💪మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు...✌*

*🤔పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారు అంటే అలాంటి ధైర్యమే కారణం...ఉమ్మడి కుటుంబాలలో మేము ఉన్నాం అనే భరోసా కారణం...😴కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు... బంధువులు నీ చుట్టూ లేక పోవటం...*

*✍కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం...అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం... ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి...🙏*

#జేబుదొంగ_కూతురికి_అర్ధరాత్రి_వెళ్లి_పాలిచ్చిన_మహిళా_పోలీసు

#జేబుదొంగ_కూతురికి_అర్ధరాత్రి_వెళ్లి_పాలిచ్చిన_మహిళా_పోలీసు

స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఆయన్నుంచి ఫోన్ వచ్చింది.
ఫోన్లో వెనుక ఎవరో పాప గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరు పాప ఏడుస్తున్నారని అడిగాను.
అప్పుడాయన నెలన్నర వయసున్న ఆ పాపను ఎవరో రోడ్డుపై వదిలేశారు.. ఒకతను పోలీసు స్టేషన్‌కి తెచ్చాడు అని చెప్పారు.
పాప అంతలా గుక్కపెట్టి ఏడుస్తోంటే.. ఒక తల్లిగా ఆ బాధ నాకు అర్థమైంది. ఏదో తెలియని బాధ.. ఆ పాపకు ఏమవుతుందో అన్న ఆందోళన.
దీంతో మరొకటి ఆలోచించకుండా ఎనిమిది నెలల వయసున్న మా బాబును మా అమ్మకు అప్పజెప్పి.. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని బేగంపేట నుంచి అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాను.
అప్పటికీ ఆ పాప గట్టిగా కళ్లు మూసుకుని గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. మరోపక్క మంచి దుస్తులు లేకపోవడంతో చలికి వణుకుతూ ఉంది. ఆ పసికందు పడుతున్న బాధను చూసి నాకే ఏడుపు వచ్చింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాపకు చనుబాలు పట్టాను. దాదాపు 40 నిమిషాల పాటు చన్ను వదల్లేదు.
కడుపారా పాలు తాగాక నెమ్మదిగా కళ్లు తెరిచింది. అప్పుడు హమ్మయ్య అనిపించి. తర్వాత ఆ పాపను మెటర్నిటీ ఆస్పతికి అప్పగించి నేను ఇంటికి తిరిగెళ్లాను.సత్య.
ఇవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న పాపకు పాలు పట్టిన పోలీసు కానిస్టేబుల్ ప్రియాంక... బీబీసీ తెలుగు ప్రతినిధి బొల్లంపల్లి వేణుగోపాల్‌కి చెప్పిన మాటలు.

ఈ రోజు నా ప్రియ మిత్రుడు నన్ను చెంప పై కొట్టాడు

ఇద్దరు స్నేహితులు ఒక ఎడారి గుండా ప్రయాణిస్తున్నారు. మాటల మధ్యలో ఒక వాదన వచ్చింది. అది పెరిగి క్రమంగా పెద్దదై ఆవేశానికి లోనై ఒక స్నేహితుడు రెండో స్నేహితుణ్ణి చెంప మీద కొట్టాడు. దెబ్బతిన్న మిత్రునికి చాలా బాధ కలిగింది. కానీ అతను తిరిగి ఏమీ మాట్లాడలేదు. కిందకు వంగి ఇసుకలో ఇలా రాశాడు.

“ఈ రోజు నా ప్రియ మిత్రుడు నన్ను చెంప పై కొట్టాడు”

అలా ఇద్దరూ నడుస్తూ ఒక ఒయాసిస్సు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ స్నానం చేసి సేద తీరాలనుకున్నారు. దెబ్బతిన్న స్నేహితుడు ప్రమాదవశాత్తూ ఒక ఊబిలో ఇరుక్కుపోయాడు. కానీ సమయానికి మిత్రుడు వచ్చి సహాయం చేయడంతో బ్రతికి బయటపడ్డాడు. మళ్ళీ ఏమీ మాట్లాడకుండా చిన్నగా ఒక రాయి దగ్గరికి వెళ్ళి మరో రాయితో దానిమీద ఇలా లిఖించాడు.

“ఈ రోజు నా ప్రియ మిత్రుడు నా ప్రాణాన్ని కాపాడాడు”

కాపాడిన మిత్రుడు అతన్ని ఇలా అడిగాడు. “నేను నిన్ను కొట్టినపుడు నువ్వు ఆ సంగతి ఇసుకలో రాశావు. కానీ నేను నిన్న కాపాడిన సంగతి మాత్రం రాతిమీద రాశావు. ఎందుకలా చేశావు?”

దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు “మనల్ని ఎవరినైనా బాధించినపుడు దాన్ని ఇసుక పై రాత లాగా తాత్కాలిక జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఎందుకంటే క్షమ అనే గాలులు వచ్చినపుడు అవి చెరిగి పోతాయి. అలాగే మనకు ఎవరైనా సహాయం చేసినపుడు దాన్ని రాయి లాంటి జ్ఞాపిక మీద భద్రపరుచుకోవాలి ఎందుకంటే ఏ గాలులూ దాన్ని చెరపలేవు”

కాబట్టి ప్రియమిత్రులారా! ఇది మీ జీవితానికి అన్వయించుకుని సంతోషమయం చేసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను.

2.జ్ఞానేంద్రియాలు 1.

జ్ఞానేంద్రియాలు 5 అవి :


1. కన్ను
2. ముక్కు
3. చెవి
4. నాలుక
5. చర్మం

కన్ను 
కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి 
1. బయటిపొర : దృఢస్తరం (మొదటిపొర )
2. మధ్యపొర :రక్త పటలం (దీనిలో అనేక రక్త నాళాలు ఉంటాయి )
3. లోపలిపొర :నేత్ర పటలం (రెటీనా ) కంటిలోని జ్ఞానాభాగం 
కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంద్రాన్ని తారక (ఐరిస్ ) అంటారు 
కంటిలో 3 పొరలో 2 రకాల కణాలు ఉంటాయి. 
1. దండ కణాలు (రాడ్స్ )
2. శంకు కణాలు (కోన్స్ )
కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను రాడ్స్ అని , తక్కువ కాంతికి పనిచేసే నరాలను కొన్స్ అంటారు 
దండకాణాలు రోడాప్సిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి . రోడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్-ఏ అవసరం. ఇవి నలుపు , తెలుపు రంగులు చూచుటకు తోడ్పడతాయి . నిశాచర జీవులయిన గుడ్లగూబ, గబ్బిలం లో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. 
శంకుకణాలు ఐడాప్సిన్  అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రాధమిక వర్ణాలైన ఎరుపు , నీలం , ఆకుపచ్చ రంగులను గుర్తించుటకు సహాయపడతాయి . 
దండకాణాలు, శంకుకణాలు లేని ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఈ  భాంగంలో  ప్రతిభింబం ఏర్పడదు 
కన్ను , కంటికి సంభందించిన వ్యాధుల అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆఫ్తాల్మాలజీ అంటారు 






Thursday

7.భారత ప్రధానులు -రచనలు

-
భారత ప్రధానులు రచనలు
1. జవహర్ లాల్ నెహ్రూ :1. డిస్కోవరి ఆఫ్ ఇండియా (భారతదేశ అన్వేషణ )
2. ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్
3. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ
4. ఎన్ ఆటో బయోగ్రఫీ
5. ఎ పొలిటికల్ బయోగ్రఫీ
2. ఇందిరాగాంధీ :
మై ట్రూత్
3. మొరార్జీ దేశాయ్ : ది స్టోరీ ఆఫ్ మై లైఫ్
4. ఎ . బి . వాజ్ పేయి :
న్యూ డైమెన్షన్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసి
5. ఐ . కె . గుజ్రాల్ : ఏ ఫారిన్ పాలసీ ఫర్ ఇండియా
2. కంటిన్యూటీ అండ్ చేంజ్
6. చంద్ర శేఖర్ : దీక్పెస్ట్ , ది హెర్డిల్స్
ఏ సోషలిస్ట్ మెన్
7. పి . వి . నరసింహ రావు : ది ఇన్ సైడర్