Friday

3.జాతీయ కారులు వారి రచనలు

జాతీయ కారులు వారి రచనలు
1. మహాత్మాగాంధి: -
మై ఎక్సపెరిమెంట్ విత్ ట్రూత్
హింద్ స్వరాజ్, రోమా రోలా
కాంక్వస్ట్ ఆఫ్ సెల్ఫ్ , ఇండియన్ హోంరూల్
2. సుభాష్ చంద్ర బోస్ :
యాన్ ఇండియన్ ఫిలిగ్రిమ్ 
ద ఇండియనస్ట్రగుల్
3. బాలగంగాధర్ తిలక్ :. 
గీతా రహస్యము 
ఆర్కిటిక్ హోమ్ అఫ్ వేదాస్ 
4. సరోజినాయుడు 
గోల్డెన్ త్రిసోల్డ్ 
బ్రోకెన్ వింగ్స్ 
ది సాంగ్ ఆఫ్ ఇండియా 
5. అబుల్ కలం ఆజాద్ 
ఇండియా విన్స్ ఫ్రీడమ్ 
6. వి. డి . సావర్కర్ 
ఇండియన్ వార్ ఆఫ్ ఇండి పెండిట్స్ 
7. లాలా లజపతిరాయ్ 
ఆన్ హ్యాపీ ఇండీయా 
8. అరవింద్ ఘోస్ :
ది లైఫ్ డివైన్ 
ఎస్సెస్ ఆన్ గీత , సావిత్రి ,ఊర్వశి 
9. సి . రాజగోపాలాచారి :
ది నేషన్స్ వాయిస్ 
ది ఫాటల్ కార్ట్ 
రీ కాన్సిలియేషన్ 
వై & హౌ 


Wednesday

5.క్రీడాకారులు వారి రచనలు

1. సునీల్ గవాస్కర్ ---సన్నీ డేస్ , ఐడల్స్
2. కపిల్ దేవ్ --స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్ , బైగాడ్స్ డిక్రీ
3. పి. టి . ఉష --గోల్డెన్ గర్ల్
4. విశ్వనాథన్ ఆనంద్ --మై బ్యూటిఫుల్ గేమ్ అఫ్ చెస్
5. డేవిడ్ బెక్ హమ్ --మై సైడ్
6. పీలే --మై లైఫ్ అండ్ ది బ్యూటిఫుల్ గేమ్
7. డాన్ బ్రాడ్ మన్ --ది ఆర్ట్ ఆఫ్ క్రికెట్
8. ఇమ్రాన్ ఖాన్ --అల్ రౌండ్ వ్యూ
9. టైగర్ వుడ్స్ --హౌ ఐ ప్లే గోల్ఫ్
10. మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ --టైగెర్స్ టేల్
11. జావేద్ మియాందాద్ --కటింగ్ ది జడ్జ్
12. మార్టినా నవ్రతిలోవా --బియింగ్ మై సెల్ఫీ
13. గ్యారీ సోబర్స్ --క్రికెట్ క్రూసేడర్స్
14. రామనాథన్ , రమేష్ కృష్ణన్ --ఏ టచ్ ఆఫ్ టెన్నిస్
15. స్టీవ్ వా --అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్

Tuesday

పెద్దలారా.....మేలుకోండి పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి.

25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.

ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.

ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.

పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.

ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.

పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో పాల్గొనేవారు.

ఆ పిల్లలలో ఒక్కడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.

ఆ అబ్బాయి 6 సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు.

ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి....

మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి వెళ్లాలని అనుకున్నాడు.

మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.

కానీ ...

ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....

ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.

ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది.

దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....

చివరికి పెద్ద కాయలే పండ లేదు.

దీనికి కారణం ఏమై ఉంటుంది? అని ఆ అబ్బాయి ఆలోచించాడు.

చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.

తాను చిన్నగా ఉన్నప్పుడు...రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.

తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు.

కానీ తర్వాత ....ఆ రైతుల కొడుకులు ....వారసత్వం తీసుకొని
ఈ పోటీలు నిర్వహించసాగారు.

వారు ....పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు ....చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.

పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.

సరిగ్గా...4 సం. ల కే పెద్ద కాయలు కాయడమే నశించిపోయింది.

మనం కూడా ....మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము.

మన భారతీయ సంస్కృతిలో మహిమాన్విత గాధలైన రామాయణ, భగ్వద్గీతలను,మన సంస్కృతీ లోని మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో మనం గత 25 సంవత్సరాలుగా విఫలమై...

వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి......
మార్కులు వస్తే చాలు....ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు....
పెద్ద ఉద్యోగం వస్తే చాలు...తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......

ఆడపిల్లలను ....ఆకలిగా చూసినా ఫర్లేదు....బాగా డబ్బు సంపాదిస్తే చాలు.....

.పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు......

ఆస్తులు కూడబెడితే చాలు.....అన్న చందంలో.... పెద్దలు జీవించడం వలనే......

ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....భయపడే దౌర్భాగ్యం దాపురించింది.

పెద్దలారా.....మేలుకోండి
పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి.

రాముడి వంశం లో పుట్టావు అని కాదు ముందు రాముడి గొప్పతనం గురించి చెప్పండి......

వచ్చే కాలమంతా బాగుంటుంది.
లేకపోతే...

ఇలాగేIIT ఫౌండేషన్ లు, ఒలంపియడ్ లు అంటూ పిల్లలను నాశనం చేసి...

సర్కస్ లో సీంహలు లా తీర్చి దిద్దకండి.

6.ఆర్థిక వేత్తలు వారి రచనలు

1. ఆడమ్ స్మిత్ --- ది వెల్త్ అఫ్ నేషన్స్
2. కార్ల్ మర్క్స్ --దాస్ కాపిటల్ , కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో
3. రాబర్ట్ మల్దాస్ --ఎస్సే ఆన్ పోపులేషన్
4.డేవిడ్ రికార్డో --ప్రిన్సిపుల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ట్యాక్సేషన్స్
5. జాన్ స్టువర్ట్ మిల్ --ఆన్ లిబర్టీ అండ్ సిస్టమ్ ఆఫ్ లాజిక్
6. జగదీష్ భగవతి --మిస్ ఎ స్ట్రీమ్ ఆఫ్ విండోస్ :ఆన్ సెట్టింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ట్రేడ్ , ఇమిగ్రేషన్ అండ్ డెమోక్రసీ , ఇండియా ఇన్ ట్రాన్సిసన్ :ఫ్రీయింగ్ ది ఎకానమీ , డి ఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్


Friday

కరుణమయుడు

కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.

' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను........

" కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు
  500 రూ.  ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి........

ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ.
ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు
వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.

పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినా
సరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని
చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.

వృద్ధాశ్రమంలోకి వెళ్ళి  ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని
అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే

" నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు
  బోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు
  చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి
  మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి
  మాకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి " అని అన్నాను.

సినిమాకు తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకుని వచ్చానని నాపై కాసేపు
అలిగినా........అక్కడ ఆ పెద్దలతో ఆటలు....పాటలు కథలతో
మా పిల్లలు ......మేము చాలా సంతోషంగా గడిపి వచ్చాము....

భోంచేసి బయటికి రాగానే ఒక పెద్దమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇలా
దీవించింది.......

" మాకు కూడా మనవళ్ళు.........మనవరాళ్ళు ఉన్నారు. వారితో ఆడుకోవాలని
   ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది ...మాకు భోజనాన్ని అందించడమే
   కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళుతున్నందుకు మీరు
   మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా
   ఉండాలని ఈ పండుటాకు దీవిస్తోంది. నీలాంటి వారికి దేవుడు అన్ని
   విధాలుగా తోడుగా ఉంటాడు......జాగ్రత్తగా వెళ్ళిరండి "

నా భార్య కళ్ళల్లో ఓ గర్వంతో కూడిన ఆనందం......నా పిల్లల మొహంలో
సినిమాకు వెళ్ళినా కనపడని సంతోషం కనిపించింది.......మంచి పనిచేశానన్న
తృప్తితో ఇంటికి వచ్చాను...........
.
.
.
.
.......అందరికి తెలియచేయాలని ఈ కొట్టుకొచ్చిన పోస్ట్.......⁠⁠⁠⁠
.
.
ఈ పోస్ట్ కి మీ కామెంట్స్ పెట్టండి

Wednesday

మనిషి దేన్నీ..... ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు

ఒక వ్యక్తికి నలుగురు  భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి...
ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా చూసుకునేవాడు...
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర
చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.......

రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు...ఆమెకూడా
అతని సమస్యను తీర్చి పంపేది.....

మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే
వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద
ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

" నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను చాలా ప్రేమగా \
చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్....
మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు.

నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై
తన మూడవ భార్యను ఇదే కోరాడు........

మూడవ భార్య ఇలా అంది.

" ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు......

" నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.....నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను
బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా.......

మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.

" మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం
దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి "

అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.....కాబట్టి మనిషి దేన్నీ.....
ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.........పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము.
అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

నాలుగవ భార్య......... మన శరీరం......

మూడవ భార్య ...............సంపద, ఆస్థిపాస్తులు......

రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు.......

మొదటి భార్య..............మన ఆత్మ..........

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి....
పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి........సరేనా!

కథ కంచికి మనం ఇంటికి...

ఉమేష్ చంద్ర స్టాట్యూ

చదలవాడ ఉమేష్ చంద్ర …
పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్కబొడుస్తాయి .. రక్తం పోటెత్తుతుంది, కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు, మహా అయితే హైదరాబాద్ అమీర్ పేట, ఎస్.ఆర్.నగర్ ఏరియాల్లో ఉండేవాళ్ళకి ”ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గర” అని అడ్రస్ లాండ్ మార్క్ గా చెప్పడానికి తెలుసేమో మరి ఎవరీ ఉమేష్ చంద్ర ..
నక్షలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్క మగాడు .. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం .. మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు సింహలు ఉన్నారు, కానీ నిజజీవితంలో “కడప పులి” అని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర.. ఆయన అమర మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు .. ఆయన కథేంటో చూద్దాం .. ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు. 1991లో IPS కి ఎన్నికై, 1991-92 లో ‘జాతీయ పోలీస్ అకాడమీ’ లో శిక్షణ పొందారు, మొదట 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ASP గా పని చేశారు. వరంగల్లులో పనిచేసిన కాలంలో “జనజాగృతి” అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లు గ్రామాల్లో పాతుకుపోయిన నక్షలిజాన్ని రూపుమాపడానికి కృషిచేస్తూ మొదటి పోస్టింగుతోనే నక్షల్స్ కు బద్దవిరోధి అయ్యారు. తరువాత కడప జిల్లాలో ఫాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి గా బదిలీ చేయబడ్డారు, అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు, చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్రలేకుండా చేసారు, అర్ధారాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు, మామూలుగా సినిమా హీరోల పైన, రాజకీయనాయకుల పైన పాటలు వ్రాస్తారు అలాంటిది పోలీసు అధికారి పై పాటలు వ్రాసారు అదికూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియడానికి.
ఫిబ్రవరి 1995 లో వరంగల్లు ‘ప్రత్యేక విధుల అధికారి’ గా నియమితులయ్యారు, ఈసారి నక్షలిజం పై విరుచుకుపడ్డారు, వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు, ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు, ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997 న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యారు, ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచిచేసింది, ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేసారు, ఆయన బదిలీ అయి వెళుతున్న రోజు ప్రజలు ఆయనికి పలికిన వీడ్కోలు అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ ఎక్కడా ఏ పోలీసు అధికారికి జరగలేదు, ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదు యస్సార్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.

Tuesday

గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*

*ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*
*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*

*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు . నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*
*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .*
*ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*
*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .*
*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*

*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? "*

*ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల 🗓 నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .*

*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .*

*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .*
*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*
*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*

*ఆ ముసలావిడకు చదువు రాదు .*
*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .*

*ఫ్రెండ్స్ , ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు .*
*కానీ , మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*

*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం  ఉంది .*

*కానీ , మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*
*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*

*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత  ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .*

*ఫ్రెండ్స్ ,*

*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం*

*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .*

*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో  కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత  .*

*ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి*

*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.*

*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత  .*

*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న  గ్రంథం భగవద్గీత.*

*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .*

*ఫ్రెండ్స్ ,*
*దేవుడు  మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి  , అర్థం చేసుకొని , దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ! *

*ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి మన భారతదేశ హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి*
హిందువుగా జీవించు హిందువునని గర్వించు

Monday

ఆడవాళ్ళు పడే కష్టాలను గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అవమానించి అసహ్యించుకోకండిరా ....

😢😢😢😔😔
శరీరం లో మాలమూత్రాలు తయారైనట్లుగా యవ్వనం లో పురుషులకు శుక్రకణాలతో కూడిన వీర్యం తయారవుతుంది, అలాగే స్త్రీఅoడంలో పిండానికి ఆహారం తయారవుతుంది,
ఆ స్త్రీ, పురుషునితో లైంగికంగా పాల్గొన్నప్పుడు శుక్రకణo అండపుగుడ్డులోకి చొరబడి పిండంగా రూపుదిద్దుకున్నపుడు అoడంలోతయారైన ఆహారం అండంలోని శిశువును బ్రతికిస్తుంది, లైoగికచర్యజరగ నప్పుడునప్పుడు అండంలో తయారైన ఆహారం బహిస్తురూపంలో బయటికి
వస్తుంది,ప్రతినెల ఇలా ఆహారం తయారవుతుంది బయటకువస్తుంది, గర్భం దరించినప్పుడు రాదు, అప్పటినుండి బహిష్టు ఆగిపోయి శిశువుకు ఆహారంగా ఉపయోగపడుతుంది, ప్రతినెల వచ్చేబహిస్ట్ ఆగిపోవడాన్ని నెలతప్పడం అంటారు, ఇది ప్రతిశరీరాంలో జరిగే ప్రక్రియ.
ఆ మూడురోజులు శరీరం నీరసంగా ఉంటుంది కాబట్టి ఒకదగ్గర కూర్చోవాలని అప్పటివాళ్ళు పెట్టుకున్న ఏర్పాటు, ఇప్పటిలాగా పాడ్స్ పెట్టుకొని చకచకా తిరగడాని కి అప్పుడు పాడ్స్ లేవు, స్త్రీలకు కూడా ఈవిషయం తెలియక ఈరోజుల్లోకూడా కోట్లమంది స్త్రీలు అపచారం అనుకుంటారు,ఇది శరీరంలో జరిగే సహజసిద్ధమైన ప్రక్రియ.

దీన్ని అనవసరపు రాద్ధాంతం చేయడం మూర్ఖత్వం.

భారత సమాజంలో ఋతుస్రావం గురించి పబ్లిక్ గా
మాట్లాడటం నేరంగా, బూతుగా భావించే దుర్మార్గమైన సంస్కృతి పాతుకుపోయి ఉన్నది. ఋతుస్రావం పట్ల ఇంకా అనేక చర్చలు జరగవలసి ఉంది. అనేక గొంతులు మౌనాన్ని వీడాల్సి ఉంది. ఈ సమాజంలో పెనుమార్పులతో కూడిన నూతన చైతన్యం వెల్లివిరియాల్సి ఉంది.
స్త్రీలు ప్రతినెలా మూడు రోజుల నుండి ఐదు రోజుల
పాటు ఋతుస్రావానికి బాధపడాల్సి ఉంటుంది. అది ప్రకృతిలో సహజమైనప్పటికి ఆ సమయం చాలా భయంకరమైంది. ఆ సమయంలో స్త్రీలు పడే ఇబ్బంది, పెయిన్, వేదనను అక్షరీకరించడానికి అక్షరాలు పూర్తిగా న్యాయం చేయలేమని గొల్లుమంటాయేమో. తీవ్రమైన బాధ, కడుపునొప్పి, ఒక్కోసారి ప్రాణాలు పోతాయేమోనన్నంతటి పెయిన్, నీరసం లాంటివి స్త్రీలను పీడిస్తాయి. ఆ వేదననంతటినీ ఓర్చుకోవడం కోసం బాధనంత పంటి బిగువున దాచేస్తుంటారు. అసహజమైన స్థితిలోంచి కృత్రిమ చిరునవ్వుతో సహజమైన స్థితిలోకి వస్తుంటారు. యధావిధిగా అందరిలో కలిసిపోతుంటారు. కలిసిపోతు వాళ్ళు ఎంత అలసిపోతారో మన సమాజం ఎప్పుడూ గుర్తించదు. కనీసం గమనించదు. అట్లా చేయడానికి ప్రయత్నించదు. అంతే కాదు. ఋతుస్రావాన్ని అంటుగా చూస్తుంది. గడప అవతలకి ముట్టుగా నెట్టివేస్తుంది. ఒక్కోసారి ఎముకలు కొరికే చలిలో అనారోగ్యం పాలవుతున్న స్థితిని గుర్తించదు. వాళ్ళకు సాయంగా ఓ చెయ్యి అందించడానికి ముందుకు రాదు. అట్టా రాకపోవడం పట్ల ఈ సమాజం సిగ్గుపడదు. సిగ్గులేనితనానికి సంస్కృతి అనే పేరును తగిలిస్తారు. దానిని భారతీయ సంస్కృతిగా చలామణి చేస్తారు. అట్లాంటి సంస్కృతి ఎంత కృరమైందో ఆలోచించాల్సి ఉంది. మనిషి బాధను గుర్తించడానికి సిద్ధపడని అనాగరికతను సంస్కృతిగా చెలామణి చేయడం ఎంత సిగ్గులేని తనమో కదా ..

-సేకరణ వివిధ వ్యక్తుల భావాల నుండి

నేను మగాడిని అని విర్రవీగే వాడా నువ్వు మగాడిలా ఇలా ఉన్నావు అంటే కూడా ఆ ఆడతల్లి పడ్డ ఎన్నో కష్టాల ఫలితమేరా ...

ఆడవాళ్ళు పడే కష్టాలను గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అవమానించి అసహ్యించుకోకండిరా ....

ఆలోచింపచేసే మెసేజ్ ఇది ...Plzz  share

Sunday

తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి.

భోగ భాగ్యలిచ్చే 'భోగి'..!
@@@@@@@@@@@@@@@@@@@@@
     తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు 'భోగి'తో ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో, హేమంత రుతువులో, శీతగాలులు వీస్తూ.. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి. సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు.

'భోగి' రోజున కొన్ని రకాల కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగి రోజే గొచ్చి గౌరీవ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటివి వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళ హారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు.

ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగో రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను 4 వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయడం కూడా ఆచారం. 'భోగి' రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.

'భోగి' మంటలు
'భోగి' జనవరి 14 న వస్తుంది. ఈ రోజు తెల్లవారక ముందే.. 3.30 నుంచి 4.00 మధ్య సమయంలో 'భోగి' మంటలు వెలిగిస్తారు. దీనిని  సంవత్సరంలో ఆ కాలంలో చలిని ప్రాలదోలడమే కాకుండా, ఇంకో సందర్భముగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు , విరిగిపోయిన బల్లలు వగైరా మొత్తం పోగు చేసి వీటితో బోగి మంటను వెలిగిస్తారు. దీని ద్వారా కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజు 'భోగి' మంటలు వెలిగిస్తారు.

కొందరి ఇళ్లలో 'భోగి' రోజు సాయంత్రం పూట చిన్న పిల్లల బొమ్మలు కొలువును  ఏర్పాటు చేస్తారు. బొమ్మలు కొలువులో పిల్లల వివిధ రకాల ఆట వస్తువులని ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. మరికొంత మంది భోగి పళ్ళ పేరంటం చేస్తారు. ఇక్కడ పేరంటాళు మరియు బంధువులు సమావేశమై , రేగి పళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.

మకర సంక్రాంతి

     జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.

సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.

సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్తాపన జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రాంతి.

మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.

మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.

కనుము విశిష్టత

సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుము. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వాంచి, పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి 'సువాసి' పూజలు చేస్తారు. ఏడాదంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు, పశు పక్ష్యాదులకు ఇది పండుగే.

మనకు ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాలను, శుభములనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.....నాగాదిత్యన్ సిద్దాంతి ,,,,,,9885337965