Monday

4.వ్యాధి విజ్ఞాన శాస్త్రం

వ్యాధి విజ్ఞాన శాస్త్రం


వ్యాధులకు సంబంధించిన శాస్త్రాన్ని పాథాలజీ
ఆరోగ్యము , దాని సంరక్షణ గురించి తెలియోజేయు శాస్త్రం హైజీన్
వ్యాధినిరోధక శక్తి /అసంక్రామ్యత గురించి అధ్యయనం -ఇమ్యునాలజీ
ప్రపంచంలో ఏ వ్యాధికి మొదటి సారిగా వ్యాక్సిన్ కొనుగోన్నారు -స్మాల్ పాక్స్ (మాసూచి ).
వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త -ఎడ్వార్డ్ జెన్నర్
"ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ" అని ఎవరిని అంటారు -ఎడ్వార్డ్ జెన్నర్
"ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ "అని ఎవరిని అంటారు-ఎడ్వార్డ్ జెన్నర్
కలరా వ్యాధికి టీకాను కనుగొన్నవారు -లూయి పాశ్చర్
ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నవారు-లూయి పాశ్చర్
రేబీస్ (హైడ్రోఫోబియా ) వ్యాధికి టీకాను కనుగొన్నవారు-లూయి పాశ్చర్
పోలియో వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త-జోనాస్ సాల్క్
పోలియో వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త(డ్రాప్స్ రూపంలో )-సేబీస్
తట్టు (మీజిల్స్ ) వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త-జాన్ ఎండార్స్
హెపటైటిస్ వ్యాధికి వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త-శాంతా బయోటిక్స్
జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఒకే ఒక రికాంబినేట్ వాక్సిన్ -హెపటైటిస్ -బి  టీకా
జాతీయ టీకా కార్యక్రమం -1978
గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు :
జలుబు
ఆటలమ్మ
బర్డ్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ
మశూచి
తట్టు (జాన్ ఎండార్స్)
న్యూమోనియా
డిప్తీరియా
కోరింత దగ్గు
క్షయ
సార్స్
కలుషిత ఆహారం , నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు:
కలరా
టైఫాయిడ్
అమీబియాసిస్
పోలియో
డయేరియా (అతిసారం )
హెపటైటిస్ (పచ్చకామెర్లు )
ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు:
గజ్జి 
ఆటలమ్మ 
చిడుము 
తట్టు 
తామర 
సిఫిలిస్ 
గనేరియా 
ఎయిడ్స్ 

ఈగల ద్వారా వచ్చే వ్యాధులు: 
కలరా 
టైఫాయిడ్ 
క్షయ 
డయేరియా 
అమీబియాసిస్ 
ఎలుకలు ద్వారా వచ్చే వ్యాధి :ప్లేగు 

దోమల ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు :
మలేరియా :ఆడ ఎనాఫిలస్ దోమ 
ఫైలేరియా (బోదకాలు)-ఆడ క్యూలెక్స్ దోమ 
మెదడువాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్ ):ఆడ క్యూలెక్స్ దోమ 
డెంగ్యూ , చికెన్ గున్యా :::ఆడ ఏడిస్ 

పందుల  ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు :
స్వైన్ ఫ్లూ , మెదడువాపు  
పోషకాహర లోపం వల్ల కలిగే వ్యాధులు :
క్వాసియార్కర్:
క్వాసియార్కర్ అనగా  ఆఫ్రికా భాషలో నిర్లక్ష్యము చేయబడిన శిశువు అని అర్ధం . 
ప్రోటీన్ లోపం వల్ల చిన్న పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది . తల్లి పాలు పిల్లలకు అందకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది .ఈ వ్యాధికి సంబంధించిన పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది . తరచుగా అతిసార వ్యాధితో బాధ పడతారు . కాళ్ళు , మొహం ఉబ్బి ఉంటాయి . 
మెరాస్ మస్ :
ఈ వ్యాధి ప్రోటీన్ +కేలరీల లోపం వల్ల వస్తుంది . 
దీనివల్ల ఉండే శరీర బరువుకన్నా 40% తక్కువగా ఉంటారు . 
దీనివల్ల కాళ్ళు , చేతులు పుల్లల్లా ఉండి ప్రక్కటెముకులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి 
జన్యు సంబంధ వ్యాధులు :
హీమోఫీలియా /రాయల్ డిసీజ్ /బ్లీ డర్ డిసీజ్:
ఈ వ్యాధి పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది . 
రక్తం గడ్డకట్టడానికి అవసరమైన త్రాంబో ప్లాస్టిన్ అను పదార్దాన్ని ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన జన్యువు X క్రోమోసోములో ఉంటుంది 
ఈ జన్యు లోపం ఉన్న వారిలో ఎంత చిన్న గాయం అయినను రక్తం గడ్డకట్టకుండా కారిపోతుంది .చివరికి మరణానికి దారితీస్తుంది . 
వర్ణాంధత్వము :(కలర్ బ్లైండ్ నెస్ )
వీరు ప్రాథమిక వర్ణాలైన ఎరుపు , నీలం , ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు . 
ఎరుపును గుర్తించలేకపోడమును -ప్రోటోనోపియా 
నీలంను గుర్తించలేకపోడమును-triatonopia 
ఆకుపచ్చను గుర్తించలేకపోడమును-డ్యూటెరానోఫియా 
అల్బినిజం :
మెలనిన్ లోపం వల్ల చర్మము తెలుపు రంగులో ఉంటుంది . 
సికిల్ సెల్ ఎనిమియా (కొడవలికన రక్తహీనత ):
ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్తకణాలను గాయపరిచే వ్యాధి . ఇది ఎక్కువగా నీగ్రో జాతులలో జరుగును . 
హైపర్ టైకాసిస్ :
శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఏర్పడటం . 


























►►1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం ◄◄

►►1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం ◄◄

►వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.
►వీధుల్లో కోడా బిళ్ళలు, గోలీలు ఆడినది మనదే చివరి తరం.
►మట్టి లో ఆటలాడిన తరమూ మనదే..
►పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
►రబ్బర్ బాల్ తో ఈప్చాండ్ ఆడి మన ఫ్రెండ్ వీపు పగల గొట్టిన చివరి తరం మనదే
►స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.
►చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు.
►స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే..
►మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
►రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.
►వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
►యంటినా తిప్పుతూ టీవీ సిగ్నల్ ను సరి చేసిన ఆఖరి తరం మనదే
►డీడీ8 చానెల్ ను ఎక్కువగా చుసిన ఆఖరి తరం మనదే
►మన వీధి లో అమ్మే గ్రీటీంగ్స్ కొని ఫ్రెండ్స్ కు పంచిన ఆఖరి తరం మనదే
►ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం.
►VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే..
►అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం.
►కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
►సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం, మరియు స్మార్ట్ మొబైల్ ను కుడా వాడుతున్నాము
►సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
►మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం.
►స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
►స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
►స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
►ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో ఆ బేధాలు చూపే వాళ్ళం కాదు.
►చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
►సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.
►శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
►ఆదివారం ఉదయం 9 కి ట్యూషన్ తప్పించుకుని"మహాభారతము" " రామాయణం" " శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే...
►ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,
►అమ్మ ఇచ్చిన రూపాయి ని అపురూపం గ చూసుకున్న ఘనతా మమదే ..
►ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
►పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
►రుపయిన్నరకు థియేటర్ లో సినిమా...
►బ్లాక్ అండ్ వైట్ టీవీ లో సినిమా చూడడానికి
►రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం
►గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం...మనమే..
►అమ్మ 25 పైసలు ఇస్తే అయిదు బలపాలని అపురూపంగా దాచుకున్న కాలం...మనమే..
►గోర్లపైన కొంగ గోరు గుర్తులు
►చువ్వాట..సిర్రగోనే ఆట..కోతి కొమ్మ...అష్ట చెమ్మ...ఆడిన తరము మనదే.
►క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
►ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
►మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం. ఇప్పడు వాటిని వాడుతున్నాము కుడా
ఇలా చెపుతూ పొతే ఇంకా చాల నే ఉన్నాయ్
ఈ 1970 - 1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి మరియు కొత్త తరానికి మధ్య
◄◄వారధి లాంటి వాళ్ళు అని నేను అంటాను మీరేమంటారు. ?◄◄

Friday

భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి తొలిసారి చెప్పిన త్రిమూర్తులు అటల్, జార్జ్ మరియు అబ్దుల్ కలాం.

(దివంగత జార్జ్ ఫెర్నాండిజ్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు కష్టపడి టైప్ చేసా. దయచేసి చదవండి)
ఆ తండ్రి తన కొడుకును చర్చికి ఫాదర్ గానో ధర్మగురువుగానో చేయాలని ఆశపడ్డాడు.
ఇష్టం కాలేదు కొడుకుకు.
ఈ దేశపు మట్టి గుణం చూడండి.
కొడుకు తనకు ఉపదేశం చేసే వాళ్ళనే ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
ఆ మతంలో ఆచారాల్లో చెప్పేదొకటి చేసేదొకటి అని ధృడపరచుకున్నాడు.
ఎట్టిపరిస్త్తితుల్లోనూ మనసుకు నచ్చని పని చేయనేకూడదని నిశ్చయించుకున్నాడు.
అతడడిగే ప్రశ్నలకు ధర్మగురువులు ఉత్తరం ఇవ్వలేకపోయేవారు.
తండ్రికి ఫిర్యాదు చేశారు కొడుకుమీద.
తండ్ర్రికి కోపం వచ్చి ఇంటినుండి వెలేశాడు.
అనుమానాలు, ప్రశ్నలు సహజమైన సమాజవాదియొక్క మూల గుణాలు.
అతడు జార్జ్ ఫెర్నాండెజ్..
జార్జ్  ఏమాత్రం బెదరలేదు..
ఒకరివద్ద చిన్నపనికి చేరుకున్నాడు.
అక్కణ్ణుండి ముంబై వెళ్ళి కార్మిక నాయకుడైన డిమెల్లో అనే వ్యక్తివద్దకు చేరాడు.
అక్కడే ఉండే సోషలిస్ట్ పార్టీ కచేరీ బెంచీమీద పడుకునేవాడు.
కడుపారా రొట్టెముక్కకూ కష్టమయ్యేది.
ముంబై ఫుట్ పాత్ పై కూడా చాలా రాత్రులు గడపాల్సివచ్చింది.
అంత కష్టం.. ఆ స్థలానికీ రోజూ కొట్లాటలు.. రౌడీలతో తొందర. ఒకరాత్రి నిద్రపోవడానికి పావలా సుంకంగా ఇచ్చుకోవాల్సివచ్చేది.
ఒక్కోసారి జీవితం లో మలుపులు.. కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకుపోతాయి.
చూస్తూండగానే జార్జ్ కార్మికనాయకుడై ఎదిగాడు.
అకస్మాత్తుగా అతడు కాంగ్రెస్ లో ప్రభావంతమైన నాయకుడిగా వెలుగుతున్న ఎస్.కె. పాటిల్ అనే వ్యక్తిపై ఎన్నికల్లో నిలవాల్సిన సందర్భం వచ్చింది.
ఎస్.కె.పాటిల్ అనే వ్యక్తికి ఎంత అహంకారం అంటే  “నన్ను ఓడించడం ఆ దేవుడితరమూ కాదు” అనేంతగా.
ఆ అహంకారం పేదప్రజల ఆరాధ్యదేవత అని చిత్రింపబడిన, ప్రజలకుండే మూర్ఖ, మూఢ అభిమానం పొందిన ఇందిరాగాంధీ  వల్ల వచ్చింది. దీనికి నెహ్రూ గాంధీ ల ఫోటోలూ తోడవడంతో కాంగ్రెస్ నాయకుల అహంకారం పేద ప్రజలతో ఆడుకునేలా చేసేది.
జార్జ్ బుద్ధివంతుడు.
కరపత్రాలు ముద్రించాడు. తనే స్వయంగా ప్రతి ఓటరువద్దకూ వెళ్ళి పంచి చెప్పసాగాడు
“సోదరులారా.. నిజం.. దేవుడిని ఓడించడం ఎవ్వరితరమూ కాదు. అయితే అహంకారంతో ఉన్న ఎస్.కె.పాటిల్ ను ఓడించడం కష్టం కాదుకదా.. ఆలోచించండి”
ఓటరు మహాశయుడు కరుణించాడు.. ఓట్లవర్షం కురిపించాడు.
అహంకారులైన కాంగ్రెస్ నాయకులేకాదు ఇందిగాగాంధీ కనుబొమలు పైకెగిసేలా చేశాడు.
=====
1975లో ఎమర్జెన్సీ వచ్చింది..
ఉన్న కోపం.పగ చల్లార్చుకోడానికి జార్జ్ ను చేతులకు సంకెళ్ళు వేసి జైలులో పెట్టారు.
ప్రజాపక్ష నాయకుడుకదా.. అదరలేదు బెదరలేదు. జైలునుండే ఎన్నికల్లో పోటీ  చేశాడు జార్జ్.
జార్జ్ కు అతడి తల్లి ప్రోత్సాహం అందించి ప్రజల్లో ప్రచారం చేసింది.
ఆ గెలుపు భవ్యమైనది. ఇందిరాగాంధీనీ భయపడేలా చేసింది. అంత గొప్ప గెలుపది.
ఇందిరాగాంధి హయాం లో దేశం మొత్తం గుత్తాధిపత్యంలో ఉండేది.
మీడియా సంస్థలు అధికారపక్షం ఏం చెబితే అదే రాసే పరిస్థితి. రేడియో గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ జార్జ్ భారత్ బంద్ పిలుపిచ్చాడు.
రైల్వేలతో సహా దేశం మొత్తం ఒకరోజుపాటు సంపూర్ణ బంద్ ఆచరించింది.
అదీ జార్జ్ పై ప్రజలకున్న గౌరవం..నమ్మకం. ఆయనకున్న బలం.
మొరార్జీదేశాయి అధికారం లో ఉండగా కేంద్ర సమాచార శాఖ మంత్రయ్యాడు.
తర్వాత మానవ వనరులశఖా మంత్రి అయ్యాడు.
ప్రపంచం మొత్తం కాంగ్రెస్ చెట్టులా ప్రాకిన కోకాకోలా కంపెనీ పానీయాలవల్ల ఆరోగ్యానికి హాని అని తెలిపి ప్రపంచపు ఒత్తిళ్ళలోనూ కోకాకోలా ను దేశం నుండి బ్యాన్ చేసేశాడు.
జార్జ్ ధీరుడు.. వీరుడు. ఏవిధమైన విదేశీ ఒత్తిళ్ళకూ లంచాలకూ లొంగలేదు.
ముందు జనతాపార్టీ ముక్కలవడంతో లాలూ ప్రసాద్ యాదవ్ జతలో చేరాడు. అప్పట్లో లాలూకు మంచి ప్రజాబలం.. (ఇప్పటికీ ఉన్నది.. వేరే రకంగా.. అది వేరే విషయం)
యాదవకులానికి చెందిన లాలూ కులరాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక జార్జ్ బయటికొచ్చేశాడు.
స్వంతంగా సమతాపార్టీ స్థాపించాడు. జార్జ్ తో నితీష్ కుమార్ జతకలిశాడు.
బిహార్ లో సమతాపార్టీ వేళ్ళూనుకుంది. అదే ఇప్పుడు జెడియుగా పేరు మార్చుకుంది.
====
ముందు అటల్ బిహారీ వాజపేయి జతకలిశాడు.
అటల్ జార్జ్ పై పూర్తి నమ్మకంతో రక్షణశాఖను అప్పగించి మంత్రిని చేశాడు.
భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి తొలిసారి చెప్పిన త్రిమూర్తులు అటల్, జార్జ్ మరియు అబ్దుల్ కలాం.
ఫోక్రాన్ అణుబాంబ్ ప్రయోగం, కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా నియంత్రించగలిగారు.
కార్గిల్ యుద్ధరంగానికే వెళ్ళారు జార్జ్. సైనికులు పడే కష్టాన్ని కళ్ళారాచూసి చలించిపోయారు.
సైనికులు హిమాలయాల్లో సంచరించడానికి సరైన బూట్లు ఇవ్వలేని కాంగ్రెస్ పై రగిలిపోయారు.
బులెట్ ప్రూఫ్ జాకెట్ అవశ్యకత ఉండింది. వెంటనే అక్కడి అందరు సైనికులకూ ఈ వసతులు కల్పించాడు.. అదీ సమర్థత అంటే.
జార్జ్ ఫెర్నాండెజ్ మార్గదర్శనంలో మన సైన్యం పాకిస్తాన్ సైనికుల్ని మట్టికరిపించి తోకముడిచేలా చేసింది.
యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల దేహాలను వారి ఇళ్ళ స్థలాలకు పంపే ఏర్పాట్లు చేయబోగా శవపేటికల అవసరం వచ్చేది.
తక్షణం విదేశాలనుండి శవపేటికలను తెప్పించి వీరసైనికులను వారి ఇళ్ళకు గౌరవంగా పంపించేవారు.
ఇక్కడ విషయం వేరొకటి.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శవపేటికల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అందులో జార్జ్ ఫెర్నాండెజ్ హస్తముందని ఆరోపణలు చేసింది.
“జార్జ్ లంచం తిన్నాడు.. దేశానికి మోసం చేశాడు. క్షమాపణ చెప్పాలి... శవపేటికల కుంభకోణంపై దర్యాప్తు చేయాలి” ఇదీ కాంగ్రెస్ మూర్ఖపు వాదన.
పచ్చ కామెర్లు వచ్చిన రోగికి లోకం పచ్చగానే కనబడుతుందట.
బలహీనమైన సంకీర్ణప్రభుత్వంలో చిన్నచిన్న లుకలుకలు.. దేశం మొత్తమ్ కాంగ్రెస్ పార్టీ మీడీయాద్వారా శవపేటికల స్కాం అంటూ హల్ చల్ చేసింది.
పాపం జార్జ్ ఫెర్నాండెజ్..
ఆయనకు కనీసం బ్యాంక్ అకౌంట్ లేదు.
రెండు గదుల ఇల్లు. ఒకే ఒక స్యూట్ కేస్ అందులో ఒక జుబ్బా, పైజమా సెట్టు, టూత్ బ్రష్, పేస్టు.
వీటితోపాటు ఒక జత హవాయి చెప్పులు.
వేసుకున్న జుబ్బా పక్క జేబులో ఒక్క పైసా కూడా ఉండేదికాదు. ఎందరెన్ని చెప్పినా వారించేవారు.
ఎక్కడికైనా సభలకు సమావేశాలకు వెళ్ళడానికి టికెట్లను పార్టీ సమకూర్చేది. హోటల్ లో కూడా భోజన వసతి పార్టీనే చేయాలి. పొరబాటున రోజువారీ భోజనం రాకుంటే జార్జ్ ఉపవాసం చేసేవారేగానీ ఎవ్వరికీ కనీసం విషయం చెప్పేవారే కారు.
ఇటువంటివ్యక్తి వీరమరణం పొందిన సైనికుల వెల కట్టలేని దేహాలను వారి కుటుంబాలకు సాగించేందుకు అవసరమయ్యే శవపేటికలకోసం లంచం తీసుకుంటారా?
పార్టీల పైశాచిక రాజకీయనృత్యానికి కుంగిపోయాడు.
కళ్ళల్లో నీరు ధారలా కారడం లేదూ...!!!?
జార్జ్ ఫెర్నాండెజ్ అనుకునుంటే ఎంత డబ్బు, ఆస్తి సంపాదించేవారు? గ్రామం లోని సర్పంచ్ కూడా కోట్లకు పడగలెత్తుతాడు.. ఓ సామాన్య ప్రభుత్వాధికారి తరతరాలు కూర్చుని తినేలా సంపాదిస్తాడు. అటువంటిది జార్జ్ ఎందుకు పార్టీలతో నిందలు పడాల్సి వచ్చింది? నిజంగా డబ్బు తిని ఉంటే ఈ నింద అసలు పడేదా?
అత్యంత సరళమైన, సౌమ్యగుణం, వ్యక్తిత్వాన్ని పొందిన జార్జ్ ఫెర్నాండెజ్ గారిని తలచుకుంటేనే కన్నీళ్ళు ఆగవు.
ఇటువంటి మహనీయుణ్ణి రాజకీయం కోసం వాడుకుంది కాంగ్రెస్ పార్టీ.
======
కర్ణాటకలోని మంగళూరులో పుట్టి, మహారాష్ట్రలో పెరిగి బిహార్ రాష్ట్రం లో రాజకీయ జీవితం కొనసాగించి.. డిల్లీనుండి దేశం మొత్తం గర్వపడేలా అనేక నిర్ణయాలు చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ కాంగ్రెస్ నిందలకు కుంగిపోయారు..
రాజకీయాలు ఇక చాలు అనుకునేంతలోనే అల్జీమర్స్ అనే (మరుపు-తనెవరో కూడా మరిచిపోయే రోగం)  వ్యాధిన పడ్డారు..
మంచిదే.. తనకు జరిగిన అవమానలను మరవడమే ఆయనకు చివరన మంచానపడినా... ఏమీ ఇవ్వని దేశం కనీసం చివరన మరచిపోయే వ్యాధిని ప్రసాదించి ప్రశాంతంగా చిన్న గదిలో గడిపేలా చేసింది.
తండ్రికి ఇష్టం కాలేదు. పార్టీకి ఇష్టం కాలేదు.. చివరన కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిందలతో చాలామంది అభిమానులనూ దూరం చేసుకున్నారు..
అయితే ఆ వ్యక్తిత్వం తెలిసిన నాలాంటి వ్యక్తులకు ఆయనెప్పుడూ గొప్ప నాయకుడే.. మహనీయుడే.
29.01.2019న తన ఇంటి చిన్న గదిలోనే వయసురీత్యా వచ్చిన వ్యాధులు, స్వైన్ ఫ్లూ వ్యాధిసోకడం తో... చాలు చాలికచాలని తమ 88వ ఏట తుది శ్వాస విడిచారు.. జార్జ్ ఫెర్నాండెజ్.
సర్. నేను సామాన్యుణ్ణి. మీకేదైనా సేవచేద్దామన్నా స్వీకరించని ఉన్నత మనస్తత్వంతో జీవించారు మీరు.. నా కంట్లోంచి రాలే చిన్న చిన్న కన్నీటిబొట్లే మీకు నేఇచ్చే నివాళి..
స్యాల్యూట్ సర్.
జార్జ్ ఫెర్నాండెజ్ సర్.
అటల్ బిహారీ వాజపేయి, అబ్దుల్ కలాం మరియు మీరు
ముగ్గురూ త్రిమూర్తులు
అమర్.. అక్బర్.. ఆంథోని..లు సర్ మీరు..
మళ్ళీ మీరు ముగ్గురూ ఒకేరోజు మనదేశంలోనే పుట్టాలి. మీకు మరో జన్మలోనైనా ఈదేశం తగిన గౌరవం ఇస్తుంది.. నా దేశం మహోన్నత భారతదేశం..
జై భారత్. జైజై భారత్.