Friday

#జేబుదొంగ_కూతురికి_అర్ధరాత్రి_వెళ్లి_పాలిచ్చిన_మహిళా_పోలీసు

#జేబుదొంగ_కూతురికి_అర్ధరాత్రి_వెళ్లి_పాలిచ్చిన_మహిళా_పోలీసు

స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఆయన్నుంచి ఫోన్ వచ్చింది.
ఫోన్లో వెనుక ఎవరో పాప గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరు పాప ఏడుస్తున్నారని అడిగాను.
అప్పుడాయన నెలన్నర వయసున్న ఆ పాపను ఎవరో రోడ్డుపై వదిలేశారు.. ఒకతను పోలీసు స్టేషన్‌కి తెచ్చాడు అని చెప్పారు.
పాప అంతలా గుక్కపెట్టి ఏడుస్తోంటే.. ఒక తల్లిగా ఆ బాధ నాకు అర్థమైంది. ఏదో తెలియని బాధ.. ఆ పాపకు ఏమవుతుందో అన్న ఆందోళన.
దీంతో మరొకటి ఆలోచించకుండా ఎనిమిది నెలల వయసున్న మా బాబును మా అమ్మకు అప్పజెప్పి.. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని బేగంపేట నుంచి అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాను.
అప్పటికీ ఆ పాప గట్టిగా కళ్లు మూసుకుని గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. మరోపక్క మంచి దుస్తులు లేకపోవడంతో చలికి వణుకుతూ ఉంది. ఆ పసికందు పడుతున్న బాధను చూసి నాకే ఏడుపు వచ్చింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాపకు చనుబాలు పట్టాను. దాదాపు 40 నిమిషాల పాటు చన్ను వదల్లేదు.
కడుపారా పాలు తాగాక నెమ్మదిగా కళ్లు తెరిచింది. అప్పుడు హమ్మయ్య అనిపించి. తర్వాత ఆ పాపను మెటర్నిటీ ఆస్పతికి అప్పగించి నేను ఇంటికి తిరిగెళ్లాను.సత్య.
ఇవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న పాపకు పాలు పట్టిన పోలీసు కానిస్టేబుల్ ప్రియాంక... బీబీసీ తెలుగు ప్రతినిధి బొల్లంపల్లి వేణుగోపాల్‌కి చెప్పిన మాటలు.