*🚶♂ఒకసారి ఒక పిరికివాడు ఒక స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి... కొంచెం దూరంలో ఒక వ్యక్తి వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు...*
*ఇంతకీ విషయం ఏమిటంటే...ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడు...కాని కేవలం వాడికి వీడు...వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది...🤝*
*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే...నేను ఉన్నాను అనే భరోసా...🗣ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్న అనే చిన్న మాట చెప్పి చూడు...💪మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు...✌*
*🤔పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారు అంటే అలాంటి ధైర్యమే కారణం...ఉమ్మడి కుటుంబాలలో మేము ఉన్నాం అనే భరోసా కారణం...😴కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు... బంధువులు నీ చుట్టూ లేక పోవటం...*
*✍కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం...అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం... ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి...🙏*