Wednesday

ఆహార పొట్లాల పంపిణీ పూర్తి

నేటితో 3153 వ రోజు
ఆహార పొట్లాల పంపిణీ పూర్తి
*********************************
ప్రతిరోజూ 200 మందికి ఆకలి తీర్చే
ఈ అన్నదాన మహాయజ్ఞాన్ని
ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నాము .
.

ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని ఉడికించి ,
.

ఆ అన్నాన్ని 200 ఆహార పొట్లాలలోకి
( లెమన్ రైస్ గానీ , పులిహోర గానీ )  సమపాళ్లలో చేర్చి ......
.

ఆ ఆహార పొట్లాలను 4 టీములలోని
స్నేహహస్తం డెవలప్ మెంటు సొసైటీ సభ్యులు
( ఒక్కో టీములో ముగ్గురు చొప్పున )
నిర్ణీత సమయంలో పంపిణీ చేస్తున్నారు .
.

ఈరొజు మా సోదరి  శ్రీమతి స్నేహలత రెడ్డి మరియు శ్రీ రామచంద్రా రెడ్డి బావ గార్ల
ముద్దుల తనయుడు చిన్నారి బాబు
మేఘశ్యామ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ......
.

ఏ ఆసరా లేకుండా ఫుట్ పాత్ ల మీదనూ ,
బస్ షెల్టరు లలోనూ , ఆలయాల పరిసరాలలోనూ ఉండే అభాగ్యులకు , వికలాంగులకు , వృద్దులకు
లెమన్ రైస్ పొట్లాలతో పాటుగా గారెలను కూడా  పంపిణీ చేయడం జరిగింది .
.

గోపిరెడ్డి జగదీశ్వర రెడ్డి
అద్యక్షులు
స్నేహ హస్తం డెవలప్ మెంట్ సొసైటీ
Whatsapp : 84988 24581