ఇద్దరూ తోడూ నీడగా #బ్రతికారు ..
ఇద్దరూ చేతులుపట్టుకునే #ఆత్మహత్య చేసుకున్నారు..
ఇద్దరు #కొడుకులయ్యా .. ఒక్క #ఆడ బిడ్డయినా లేదు , ఉంటె హాయిగా ఉండేది.. ఇదీ ఆత్మహత్యకు ముందు వృద్ధ దంపతులు అన్న #చివరిమాట..
ఇద్దరూ చేతులుపట్టుకునే #ఆత్మహత్య చేసుకున్నారు..
ఇద్దరు #కొడుకులయ్యా .. ఒక్క #ఆడ బిడ్డయినా లేదు , ఉంటె హాయిగా ఉండేది.. ఇదీ ఆత్మహత్యకు ముందు వృద్ధ దంపతులు అన్న #చివరిమాట..
నెల్లూరు : ఆ వృద్ద దంపతులకు ఏం కష్టమొచ్చిందో కానీ... జీవితంపై విరక్తితో ప్రాణాలు విడిచారు. ఇంటినుంచి బయటకు వచ్చిన దంపతులు జలాశయంలో శవాలై తేలారు. అనంతసాగరం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వింజమూరుకు మండలం ఎర్రబల్లిపాళెంకు చెందిన మాదిరెడ్డి చినపెంచలరెడ్డి (75), రమణమ్మ (65) భార్యాభర్తలు నిన్న ఉదయం సోమశిల జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ జలాశయంలో మునిగేందుకు ప్రయత్నించగా మత్స్యకారులు అడ్డుకున్నారు.
తమకు ఇద్దరు కుమారులు అని, తమకు అనేక భాదలు ఉన్నాయని దంపతులు జాలర్లకు తమ భాదలు చెప్పుకున్నారు. వారికి సర్ధిచెప్పిన జాలర్లు అక్కడి నుంచి పంపించేశారు. తీరా సాయంత్రం చూసేసరికి ఇద్దరి మృతదేహాలు జలాశయంలో శవాలుగా తేలాయి.
రాత్రి మృతదేహాలను వెలికితీసేందుకు వీలుకాకపోవడంతో ఇవాళ ఉదయం బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుమారులు, కుటుంబసభ్యులు అనంతసాగరం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Post copied
ఇలాంటి గాధలు చదివినప్పుడు హృదయం ద్రవించిపోతుంది...
